మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం
మహేశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్ |
సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమమ్ || 1 ||
తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితమ్ |
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలమ్ || 2 ||
మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినమ్ |
పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణమ్ || 3 ||
శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్ |
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || 4 ||
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్ |
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభమ్ || 5 ||
నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్ |
పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభమ్ || 6 ||
పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహమ్ |
అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితమ్ || 7 ||
షడక్షరస్థితం దేవం నమామి కపినాయకమ్ |
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితమ్ || 8 ||
సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహమ్ |
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలమ్ || 9 ||
నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనమ్ |
అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్ || 10 ||
జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకమ్ |
ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణమ్ || 11 ||
అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహమ్ |
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణమ్ || 12 ||
పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణమ్ |
మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజమ్ || 13 ||
పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహమ్ |
సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహమ్ || 14 ||
ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |
ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || 15 ||
ఇత్యుమాసంహితాయాం ఆంజనేయ స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.